వెంకటగిరిలో అభివృద్ధి పనులు: మట్టి రోడ్లు లేకుండా రహదారుల నిర్మాణం
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వెంకటగిరి నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేదే లేకుండా ఆధునిక రహదారుల నిర్మాణం చేపడుతున్నామని స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామ కృష్ణ స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొంటూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచే దిశగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు ముందుకుసాగుతున్నాయని, ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.