నాని ది పారడైజ్ చిత్రానికి ఏ సర్టిఫికెట్ మరియు 21 కట్స్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ది పారడైజ్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, అభ్యంతరకర పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్పులు మరియు కట్స్ సూచించింది. ఈ మార్పుల అనంతరం సినిమా తుది నిడివి 174 నిమిషాలుగా ఖరారైంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ మాస్ డ్రామా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.