విదేశీ ఆయుధాల అక్రమ రవాణా కేసులో పంజాబీ యూట్యూబర్ మణి షోకర్ అరెస్ట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Jalandhar

పంజాబ్‌లోని జలంధర్‌లో విదేశీ తయారీ ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పంజాబీ యూట్యూబర్ మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మణి షోకర్‌తో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. జలంధర్ డిసిపి ఆదిత్య వారియర్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18న జాండియాలా మోర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు సాహసోపేతంగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు పిస్టల్స్, ఐదు తూటాలను స్వాధీనం చేసుకున్నారు.