విధ్వంసమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారంటూ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో విధ్వంసం, అలజడి సృష్టించి పెట్టుబడిదారులను రాకుండా చేయాలనే లక్ష్యంతో గొడ్డలి పార్టీ అధినేత జగన్ పనిచేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో అపోహలు సృష్టించి హడావుడి చేస్తున్నారని, ఉపాధ్యాయ అభ్యర్థుల పేరుతో దాడులకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.