భక్తిశ్రద్ధలతో పరవాడ మండలంలో వైభవంగా వినాయక చవితి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పరవాడ

పరవాడ మండలం వెన్నెలపాలెంలో వినాయక చవితి వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మరియు మాధవీలత దంపతులు ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. సన్నాయి, డప్పు వాయిద్యాల నడుమ గణనాథుని ఊరేగింపు ఘనంగా సాగింది. అనంతరం గ్రామంలోని వివిధ వినాయక మండపాలను ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, యువత, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.