ఆత్మహత్యల నివారణ సమాజం ఉమ్మడి బాధ్యత: మంత్రి సత్యకుమార్ యాదవ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్యల నివారణ సమాజం ఉమ్మడి బాధ్యతని, మానసిక సమస్యలతో బాధపడేవారికి ఓదార్పు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. టెలీ మానస్ 14416 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తక్షణ సాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని, విద్యార్థులలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.