ఈసీ చీఫ్ జ్ఞానేశ్ కుమార్పై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల నమోదు ఫామ్ ఆరు మార్పులపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడంతో ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కోర్టు ఆదేశాల పేరుతో ఈసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.