విజయనగరం జిల్లా పుర ఎన్నికల్ లో సత్తా చాటిన పన్నెండు మంది స్వతంత్రులు

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలోని పలు పురపాలికల్ లో ప్రధాన రాజకీయ పార్టీలను ఎదురొడ్డి బరిలో నిలిచిన పన్నెండు మంది స్వతంత్ర అభ్యర్థులు ఘన విజయం సాధించారని స్థానిక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బొబ్బిలి, నెల్లిమర్ల నగర పంచాయతీలతో పాటు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోనూ రెబెల్స్ సత్తా చాటారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసిన వీరు ఓటర్లను ఆకట్టుకుని కౌన్సిలర్ పదవులను కైవసం చేసుకున్నారు.