నెల్లూరులో దివ్యాంగుల తల్లిదండ్రుల ఆవేదన: పింఛను పెంచి ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో పుట్టుకతో వైకల్యం ఉన్న తమ పిల్లల వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న పింఛనును పదిహేను వేల రూపాయలకు పెంచి ఆదుకోవాలని బాధిత తల్లిదండ్రులు అధికారులను వేడుకున్నారు. కావలి ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ, వెల్డింగ్ కూలీ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నెల్లూరుకు చెందిన బేల్దారి కార్మికుడు పెంచలయ్య కూతురి వైద్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.