అమరావతిలో ప్రజా రవాణాపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి
రిపోర్టర్: రాజేష్
స్థలం: Amaravati
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజారవాణా కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరుతో పాటు సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా రవాణా వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.