నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఆర్ఎంఎస్ సీఈటీ ప్రకటన వెల్లడి
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ప్రవేశాల నిమిత్తం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆర్ఎంఎస్ సీఈటీ 2026 ప్రకటనను విడుదల చేసింది. ఆరు మరియు తొమ్మిదవ తరగతుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. అక్టోబర్ 20, 2026 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా, ఆలస్య రుసుముతో అక్టోబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.