విశాఖలో కలకలం: కోళ్లగూడులోకి ప్రవేశించి పన్నెండు గుడ్లు మింగిన నాగుపాము
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలోని శనివాడ కాలనీలో నరేష్ ఇంటి ఆవరణలోని కోళ్లగూడులోకి సుమారు ఆరడుగుల పొడవున్న నాగుపాము ప్రవేశించిందని స్థానికులు తెలిపారు. ముందుగా ఒక కోడిని కాటువేసిన ఈ విషసర్పం, గూడులో ఉన్న మొత్తం పన్నెండు గుడ్లను ఒక్కొక్కటిగా మింగేసిందని వారు వెల్లడించారు. గుడ్లను తిన్న కారణంగా కడుపు విపరీతంగా ఉబ్బిపోయి కదలలేని స్థితిలో ఉన్న పామును చూసి కుటుంబ సభ్యులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారని స్థానికులు పేర్కొన్నారు.