వైఎస్సార్సీపీ వక్రీకరణలపై చంద్రబాబు నిప్పులు: రెబల్స్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వైఎస్సార్సీపీ వక్రీకరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, జగన్ లాంటి క్రిమినల్ లిటిగెంట్ల వల్ల అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా నామినేషన్లు వేసి ఉపసంహరించుకోని వారిపై కఠినంగా సస్పెన్షన్ వేటు వేస్తామని ఆయన హెచ్చరించారు.