టీ20 మ్యాచ్లో విండీస్ ఆటగాళ్లకు షాక్: ఐసీసీ తీవ్ర చర్యలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: రాంచీ

రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో మైదానంలో నియమావళిని ఉల్లంఘించిన వెస్టిండీస్ ఆటగాళ్లు రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్లపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ తెలిపారు. ఇరు ఆటగాళ్లను అధికారికంగా మందలించడంతో పాటు వారి ఖాతాలో ఒక్కో డీమెరిట్ పాయింట్ను నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మ్యాచ్ సందర్భంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక ప్రవర్తించిన తీరుపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.