కుప్పాయపాలెంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లి పంచాయతీ కుప్పాయపాలెంలో కూటమి ఎంపీటీసి అభ్యర్థి ఒంటిమిట్ట రాజేశ్వరి, జెడ్పీటీసీ అభ్యర్థి సర్వేపల్లి రత్నయ్య గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు, చంద్రారెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.