ఎమ్మెల్సీ తాత మధును వెంటనే సస్పెండ్ చేయాలి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమానించినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.