రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ నిరసన ప్రదర్శన: నూతన భద్రత ఏర్పాట్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: దిల్లీ
దేశ రాజధాని దిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమైందని, ఈ మేరకు నాలుగు వేలకు పైగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఎన్నికల అక్రమాలను నిరసిస్తూ ఈ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ నిరసనలో లక్ష మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని భావిస్తుండగా, ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్ లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.