బంగ్లాదేశ్ క్యాప్టెన్ హ్యాండ్ షేక్ వివాదంపై స్పందించిన బీసీబీ

రిపోర్టర్: రమేష్ స్థలం: World

భారత మహిళా జట్టుతో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తీరుపై ఆ దేశ క్రికెట్ బోర్డు స్పష్టతనిచ్చింది. ఇది బోర్డు నిర్ణయం కాదని, పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమేనని స్పష్టం చేసింది. అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని బీసీబీ వెల్లడించింది.