చంద్రబాబును కలిసిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్లోని నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 22న జరగనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఈ సందర్భంగా చంద్రబాబును ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని చంద్రబాబు స్వీకరించి, కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల సంబంధాలు, తెలుగు ప్రజల ఐక్యతపై చర్చించారు.