బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డు ధర ముప్పై తొమ్మిది లక్షలు

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకు అమ్ముడైందని, ఈ బిడ్ను సామా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ సుధాకర్ ఉడుముల తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి నాలుగు లక్షలు అధికంగా పలికిందని పేర్కొన్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోలీసులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసినట్లు ఆయన వెల్లడించారు.