ఇరాక్ లోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుళ్లు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

ఇరాక్ కు చెందిన కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల స్థావరం సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్నట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. అయితే ఈ పేలుళ్లు సైనిక శిక్షణ, భద్రతా కార్యకలాపాల వల్లనే సంభవించాయని కుర్దిష్ తీవ్రవాద నిరోధక అధికారులు తరువాత స్పష్టం చేశారు.