జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: జగిత్యాల

తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడి, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ జగిత్యాల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినట్లు తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణకు ఆమె చేసిన త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా గుర్తుచేశారు.