కేసీఆర్ కుటుంబంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Telangana

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ మాట తప్పి కుటుంబమే పదవులు అనుభవించిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, పదవులు తీసుకోమని చెప్పి మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబం వందల ఎకరాల ఆస్తులు సంపాదించుకుందని టీపీసీసీ ఎంపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.