మట్టి పనుల్లో లక్షల స్వాహా: గుత్తేదారులపై చర్యలకు కలెక్టరేట్ ఆదేశాలు

రిపోర్టర్: హరి స్థలం: కలువాయి

పేదల ఇళ్ల స్థలాల చదును పనుల్లో గుత్తేదారులు రూ.లక్షలు స్వాహా చేసినట్లు క్వాలిటీ కంట్రోల్ తనిఖీల్లో వెల్లడైందని కలువాయి తహసీల్దార్ కృష్ణారెడ్డి తెలిపారు. రూ.65.35 లక్షల రికవరీకి ఉత్తర్వులు అందినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా కలెక్టరేట్ నుంచి మరోసారి ఆదేశాలు జారీ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో, త్వరలోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.