బిగ్ బాస్ హౌస్లో హైడ్రామా: అల్టిమేట్ కెప్టెన్గా త్రిగున్ ఎంపిక

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ హౌస్లో జరిగిన హోరాహోరీ కెప్టెన్సీ టాస్క్లో త్రిగున్ అల్టిమేట్ గోట్గా నిలిచి నూతన కెప్టెన్గా ఎంపికయ్యారని బిగ్ బాస్ నిర్వాహకులు తెలిపారు. ఈ వారం కెప్టెన్గా గెలవడంతో పాటు బిగ్ బాస్ ఉన్నంతకాలం ప్రతి కెప్టెన్సీ రేసులోనూ త్రిగున్ నేరుగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారని వెల్లడించారు. ఈ టాస్క్ సమయంలో హౌస్మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరగడంతో పాటు రోహిత్, అమన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని నిర్వాహకులు స్పష్టం చేశారు.