విద్యార్థులపై వేటును సమర్థించిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కోల్కతా
సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆరుగురు విద్యార్థులపై విధించిన ఏడాది వేటును యాజమాన్యం సమర్థించింది. క్యాంపస్లో జరిగిన విధ్వంసం, భౌతిక దాడికి పాల్పడటం వల్లే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనకు నటుడు నషీరుద్దీన్ షా మద్దతు తెలపడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బీజేపీ ప్రతీకార రాజకీయాల వల్లే విద్యార్థులు బలికావాల్సి వచ్చిందని షా తీవ్రంగా ఆరోపించగా, వర్సిటీ వర్గాలు మాత్రం నిరసన శాంతియుతంగా జరగలేదని స్పష్టం చేశాయి.