ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల విజయంపై భువనేశ్వర్ లో సంబరాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Bhubaneswar
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘనవిజయం సాధించడంతో ఒడిశాలోని భువనేశ్వర్ లో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అభిలాష్ పాండా ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి టటాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థి లోకం ఏబీవీపీకి సంపూర్ణ మద్దతు తెలిపిందని నేతలు పేర్కొన్నారు.