హైదరాబాద్ ప్రయాణికులకు తీపి కబురు: సాధారణ ప్రయాణాలకు పుష్పక్ ఏసీ బస్సులు
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
హైదరాబాద్ నగర ప్రయాణికులకు సాధారణ ప్రయాణాల కోసం పుష్పక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే అవసరం లేకపోయినా నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ఈ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. కనీస ఛార్జీ వంద రూపాయలుగా నిర్ణయించామని, అలాగే ఆరు వందల రూపాయలతో ఏడు రోజుల వారపు పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు.