నగరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అధికారి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి మండల ప్రత్యేక అధికారి యస్కేవీ సత్యనారాయణ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. వీఎన్ఆర్ పేట, తడుకు ఎస్టీ కాలనీ, ముడిపల్లి దళితవాడల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.