యునైటెడ్ నేషన్స్ వేదికపై పేజర్‌ను ప్రదర్శించిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
రిపోర్టర్: హరి
స్థలం: New York
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. సమావేశంలో ఆయన ఒక పేజర్‌ను పైకెత్తి ప్రదర్శిస్తూ, 2024 సెప్టెంబర్‌లో లెబనాన్‌లోని హిజ్బుల్లా కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఆపరేషన్‌ను గుర్తుచేశారు. హిజ్బుల్లా ఖచ్చితంగా ఆ పేజర్లను గుర్తుపెట్టుకుంటుందని హెచ్చరించారు. గత మూడేళ్లుగా తమ సైనికులు ఏడు మోర్చాలపై యుద్ధం చేస్తున్నారని, ఇరాన్ అణు సామర్థ్యాలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకున్నామని నెతన్యాహు స్పష్టం చేశారు.