బెల్లంపల్లిలో మైసమ్మ గుడిలో చోరీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలోని మైసమ్మ ఆలయంలో హుండీని చోరీ చేసేందుకు యత్నించిన ఇద్దరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆలయ తాళాలు పగులగొట్టి హుండీని ఎత్తుకెళ్తుండగా సిబ్బంది గమనించి పట్టుకున్నారు.
నిందితులను మడక చిరంజీవి, కుంటాల భీమయ్యగా గుర్తించామని సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు. వీరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని, కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.