అహ్మదాబాద్ లో ఘోరం: ఫుట్ పాత్ పై దూసుకెళ్లిన ఎస్ యూవీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అహ్మదాబాద్

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నికోల్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దేవాశ్య పాఠశాల సమీపంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కుటుంబంపైకి వేగంగా దూసుకొచ్చిన ఫార్చ్యూనర్ కారు బీభత్సం సృష్టించిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ నరేష్ కంఝరియా స్పష్టం చేశారు.