విజయ్ ఆంటోనీ అప్పకుట్టి సినిమా విడుదల తేదీ ఖరారు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ట్యాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో ము.మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అప్పకుట్టి. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతం అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ సినిమాలో ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా నటిస్తుండగా కీలక పాత్రల్లో లితాన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మదన్ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు హీరో విజయ్ ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.