ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: వైఎస్ జగన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పరీక్ష నిర్వహించకుండానే నకిలీ సర్టిఫికెట్లతో 372 పోస్టులను భర్తీ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని విమర్శించారు.