ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా బూరా మనోజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరంలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా 27వ మహాసభల్లో బూరా మనోజ్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.