కర్ణాటకలో స్టింగ్ ఆపరేషన్ కలకలం: కుమారస్వామిపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ సర్కార్
రిపోర్టర్: గోపి
స్థలం: బెంగళూరు
కర్ణాటకలో సంచలనం సృష్టించిన స్టింగ్ ఆపరేషన్ వివాదం కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి చుట్టూ బిగుసుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ వీడియోల వ్యవహారంలో కుమారస్వామి నివాసంలోనే కుట్ర జరిగిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. తనను అకారణంగా ఇరికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు.