మొహాలీ జీమడా కార్యాలయంలో ముప్పై గంటలుగా ఈడీ సోదాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: మొహాలీ

పంజాబ్లోని మొహాలీ గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముప్పై ఆరు గంటలకు పైగా కొనసాగుతున్నాయి. అధికారిక రికార్డులు, కంప్యూటర్ సిస్టమ్లను పరిశీలిస్తున్న కేంద్ర ఏజెన్సీ అధికారులు సిబ్బందిని విచారిస్తున్నారు. రూ. కోట్ల బకాయిల మాఫీ ఆరోపణలు, ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థతో కుమ్మక్కు అనే అంశాలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం పంజాబ్లో రాజకీయ దుమారం రేపింది.