ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా అకిటి మల్లేష్ నియామకం

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

కొనాపూర్ గ్రామానికి చెందిన అకిటి మల్లేష్ ముదిరాజ్ ఓబీసీ నాగర్కర్నూల్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయనను స్థానిక నాయకులు ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఆయన నిరంతరం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల శివకృష్ణ, గుండెమోని శివకుమార్, జాజల కుమార్, మాశమోని ఎదమయ్య తదితరులు పాల్గొన్నారు.