యూకే నుంచి విడిపోవాలని వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ నిర్ణయం!
రిపోర్టర్: విజయ్
స్థలం: World
ప్రపంచాన్ని ఏలిన యునైటెడ్ కింగ్డమ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యూకే నుంచి బయటపడి పూర్తి స్వయంప్రతిపత్తిగల దేశాలుగా ఉండాలని వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఆ దేశాల ఫస్ట్ మినిస్టర్లు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వెస్ట్‌మినిస్టర్ సమయం ముగిసిందని, తమ భవిష్యత్ ఐరోపా యూనియన్‌తో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో యూకేలో ఇంగ్లాండ్ మాత్రమే మిగిలే అవకాశం ఉంది.