'బొబ్బిలి ఫ్లైఓవర్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలి': కాంగ్రెస్ నేత మువ్వల డిమాండ్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించిన పదేళ్లకే గుంతలమయమై ప్రమాదకరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు. నాసిరకం నిర్మాణ సామాగ్రి వాడకం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పది ఏళ్లకే వంతెన దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.26 కోట్లతో చేపట్టిన ఈ వంతెన నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ, ఏసీబీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అల్లాడ వెంకటరమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.