ఫేక్ ప్రచారాలను టీమ్ స్పిరిట్‌తో తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సునీల్ స్థలం: గుంటూరు

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధి ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని శ్రేణులకు సూచించారు. గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఆధార సహితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉచిత ఇసుక విధానంపై అప్రమత్తంగా ఉండాలని, ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.