నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న సుంకిరెడ్డి

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూలలో కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 20 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, యువత ప్రతి ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇలాంటి జాబ్ డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మహేష్, చంద్రశేఖర్, యువకులు పాల్గొన్నారు.