స్థానిక ఎన్నికల్లో రెబల్స్గా బరిలోకి దిగితే కఠిన చర్యలు: చంద్రబాబు హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబల్స్గా బరిలోకి దిగితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నామినేషన్లు వేసిన వారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య పూర్తి సమన్వయంతో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.