గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం వడమాల నుంచి వడ్డి ఇండ్లు వరకు యాభై లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు ఈ పనులతో రవాణా కష్టాలు తొలగిపోనున్నాయి.