వంట నూనెల దిగుమతి సుంకాల తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందాలి
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
వంట నూనెలపై దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని వంట నూనె కంపెనీలను ఆదేశించింది. పండుగ సీజన్‌కు ముందే దేశీయంగా వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సుంకాల తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు అందేలా చూడాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు.