ట్రంప్ హెచ్చరికలపై బాలకృష్ణ వీడియో పంచుకున్న ఇరాన్ రాయబార కార్యాలయం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇరాన్ వినూత్న రీతిలో స్పందించింది. న్యూయార్క్లో జరిగిన ఐరాస సమావేశంలో ఇరాన్ను సర్వనాశనం చేస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై జింబాబ్వెలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. తెలుగు నటుడు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలోని యాక్షన్ ఘట్టాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇరాన్ నిస్సహాయ దేశం కాదంటూ ట్రంప్కు గట్టిగా బదులిచ్చింది.