ఎన్నికల సంఘం తీరుపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఎన్నికల సంఘం చేపడుతున్న చర్యలపై సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ తీవ్రంగా విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో ఈసీ చేస్తున్న వింత, వికృత చర్యలు ప్రజల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని మండిపడ్డారు. ఎల్.కె. అద్వానీ, ఎస్. జైశంకర్ వంటి ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం ఏ విధమైన ప్రక్షాళన అని నిలదీశారు. ఈసీ ప్రధాన మంత్రి కార్యాలయం ఆడించే నాటకంలో పావుగా మారకూడదని హితవు పలికారు.