ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్దతుతో కుట్ర పన్నుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఆరోపించారు. హిందూ ఓటర్లు ఐక్యంగా లేరని కాంగ్రెస్ భావిస్తోందని, వారి సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో చూపాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ప్రాణ దోస్తులని, కేటీఆర్ తన స్నేహితులతో కలిసి క్విడ్ ప్రో కో దందాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.