కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి మంథని పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన త్యాగాలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.