కాకా వెంకటస్వామికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఘన నివాళులు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం కాకా చేసిన పోరాటాలను, కార్మిక పెన్షన్ల పెంపులో ఆయన పాత్రను ఈ సందర్భంగా వక్తలు ప్రత్యేకంగా స్మరించుకున్నారు.